BREAKING
21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం డిసిసి అధ్యక్షురాలికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బికెఆర్ సత్కారం గోదావరిలో మృతి చెందిన చేపలను పరిశీలించినవిప్ నాయకర్ కోర్‌వీవ్ సిఈఓ సంచలన నిర్ణయం వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కావలి రామ సీత నామినేషన్ ఇండోనేషియా స్టాక్ మార్కెట్‌కు గ్లోబల్ షాక్ అమలాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి సమన్వయ సమావేశం: ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే ఆనందరావుల నేతృత్వంలో సీట్ల ఒప్పందం మోక్షపురి కంచిలో మంగళరూపిణి - కామాక్షమ్మ (అష్టాదశ శక్తిపీఠాలలో 2వది) వైఎస్సార్‌సీపీలో చేరిన జెట్టి అరుణ్ రేపల్లెలో 13 వార్డులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన శ్రీ సరస్వతి మాత అలంకరణలో దర్శనమిస్తున్న వన మైసమ్మ తల్లి. జెమినీ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌కు ఎదురుదెబ్బ భూగర్భ జలాల పెంపునకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు దోహదం:డీపీఓ జయసుధ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి --ఎమ్మెల్యే డాక్టర్ కామినేని పిలుపు

కాత్యాయని అలంకారంలో శ్రీ మానసా దేవి అమ్మవారు..

Select Suryaa Now
కాత్యాయని అలంకారంలో శ్రీ మానసా దేవి అమ్మవారు..

వరికుంటపాడు మేజర్ న్యూస్ :  మండల పరిధిలోని తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మానసా దేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు అమ్మవారిని కాత్యాయని అలంకారంలో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కాత్యాయని దేవి రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం శుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేదమంత్రాలు, భక్తుల ప్రార్థనల నడుమ అమ్మవారికి పూజలు చేసి, భక్తులు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహిస్తుండటంతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలను అందజేశారు. అమ్మవారి కృపాకటాక్షాలు తమ కుటుంబాలపై ఉండాలని భక్తులు ప్రార్థించారు. ఆలయాన్ని పలు రకాల పొట్పాలు పలు రకాల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.