BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

కారు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్.. ఎద్దులతో వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు, కేసు నమోదు

Select Suryaa Now
కారు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్.. ఎద్దులతో వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు, కేసు నమోదు

వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్. రామళ్లకోట గ్రామ శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్నటి దినము (17-10-2026) సాయంత్రం సుమారు 06:30 గంటల సమయంలో రామళ్లకోట గ్రామ శివార్లలోని సుగాలమ్మ గుడి దగ్గర, మొలక సీమ శ్రీకాంత్ (27) అనే వ్యక్తి ఎద్దులతో పాటు తన ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఆ సమయంలో పెద్దకొట్టాలా గ్రామానికి చెందిన మదార్ సాహెబ్ అనే వ్యక్తి 'AP 05 CU 5009' నెంబరు గల కారును అతివేగంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వచ్చి శ్రీకాంత్‌ను బలంగా ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై క్షతగాత్రుడి తండ్రి బోయ మొలకసీమ రంగస్వామి (57, తండ్రి పేరు లేట్ మొలకసీమ పెద్ద హనుమంతు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. నేడు (18-10-2026) కారు డ్రైవర్ మదార్ సాహెబ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.  సూర్య.ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం