BREAKING
అనుమతులు ఘనం.. బిల్లులు శూన్యం బీవీసీలో భట్లపాలెం నందు యువజన ఉత్సవాలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకన్న ఆలయం మోడరన్ హైస్కూల్ లో ఆకట్టుకున్న రోబోటిక్స్ శిక్షణా కార్యక్రమం నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు. నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సహాయం కళ్యాణదుర్గం టి - సర్కిల్ అభివృద్ధి పనులకు శ్రీ కారం. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెక్కొండలో ఉపేందర్ హాస్పిటల్ పై అధికారుల దాడి అర్హులైన పట్టభద్రులు ఫారం- 18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి హనుమకొండ ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం కళ్యాణదుర్గం కొల్లాపూరమ్మ ఆలయం లో చోరీ.

కారం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ

Select Suryaa Now
కారం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ

కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ.…

అమలాపురం మేజర్ న్యూస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి మండలం మాగం గ్రామంలో మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న శివాజీ నివాసానికి చేరుకున్న మందకృష్ణ ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారుఅనంతరం శివాజీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. తమ మధ్య కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ దళితుల అస్తిత్వం, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఉందన్నారు. విడివిడిగా ఉన్నప్పటికీ దళితులకు అన్యాయం జరిగినప్పుడు ఐక్యంగా పోరాడతామని తెలిపారు. దళితులపై దాడులు, వివక్ష కొనసాగుతున్నాయని, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

కారెం శివాజీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళితులను ఐక్యం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌లో దళితుల హక్కులు, రిజర్వేషన్లను పదేపదే పొడిగించే విధానానికి బదులుగా శాశ్వత ప్రాతిపదికన అమలు చేసేలా మందకృష్ణ మాదిగతో కలిసి పోరాడుతామని చెప్పారు. కార్యక్రమంలో సుమారు 150 మంది ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.