BREAKING
బీజేపీలో భారీ సంస్థాగత మార్పులు: వివిధ రాష్ట్రాలకు ప్రధాన కార్యదర్శుల నియామకం.. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటన సిమ్లా శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం: కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం ఎస్ఎస్ రాజమౌళి వారణాసి సినిమాపై ఎస్ఎస్ కార్తికేయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అగ్నిపర్వతంలా ఉంటుందంటూ! టాటా సన్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ పునర్నియామకానికి న్యాయపరమైన మద్దతు: నోయెల్ టాటా అభ్యంతరాలు తోసిపుచ్చిన బోర్డు గ్రేటర్ నోయిడాలో యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో: శుక్రవారం ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాలపూర్ గణపయ్యకు సబితమ్మ ప్రత్యేక పూజలు వర్షపు నీటిని ఒడిసిపట్టి జలాశయాలను నింపండి: అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం శంకర్‌పల్లి ‘కే రాజా’ నిమజ్జనోత్సవానికి హాజరైన నందమూరి దీపికా జానకిరామ్ కల్పసార్ ప్రాజెక్టుపై సాంకేతిక సహకారం కోసం భారత్, నెదర్లాండ్స్ మధ్య కీలక ఒప్పందాలు వెంకటేష్ మూవీ వాయిదా.. శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు కొత్త రిలీజ్ డేట్ తప్పదా? హిందు పండుగల పైన రాజకీయాలు చేస్తే సహించం.సింకారు శివాజీ ఢిల్లీ వర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినుల భద్రతపై ఏబీవీపీ ఆందోళన: వీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన ప్రజల సమస్యలు పరిష్కారం ప్రభుత్వ లక్ష్యం మంత్రి కందులు దుర్గేష్ గిన్నిస్ రికార్డ్‌లో అల్లు అర్జున్ ‘రాకా’ అరుదైన ఘనత.. 37 మందితో ఏకకాలంలో మోషన్ క్యాప్చర్! కూకట్‌పల్లి జ్యువెల్ హైట్స్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం.. రూ. 3,02,000లకు లడ్డును దక్కించుకున్న సూర ప్రసేన్‌జిత్, శరత్ బృందం!

కాకినాడ జిల్లాలో 38 మద్యం దుకాణాలకు దరఖాస్తులు

Select Suryaa Now
కాకినాడ జిల్లాలో 38 మద్యం దుకాణాలకు దరఖాస్తులు

కాకినాడ జిల్లాలో 38 మద్యం దుకాణాలకు దరఖాస్తులు

171 దుకాణాల్లో 133 రెన్యువల్.. మిగిలిన వాటికి కొత్తగా ఎంపిక

ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్‌ రిఫండబుల్ ఫీజు

అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు గడువు

అక్టోబర్ 5న కలెక్టర్ సమక్షంలో లాటరీ

ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో: కాకినాడ జిల్లాలో 2026–27 సంవత్సరానికి రెన్యువల్ కాని 38 మద్యం దుకాణాలకు కొత్త లైసెన్సుదారుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. జిల్లాలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ పరిధిలో మొత్తం 171 మద్యం దుకాణాలు ఉండగా, వాటిలో 133 రెన్యువల్ అయ్యాయి. మిగిలిన 38 దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఏడు స్టేషన్ల పరిధిలో 38 దుకాణాలు

తాళ్లరేవు ఎక్సైజ్‌ స్టేషన్ పరిధిలో 4, కాకినాడ సౌత్‌లో 4, కాకినాడ నార్త్‌లో 8, పెద్దాపురంలో 7, పిఠాపురంలో 8, ప్రతిపాడులో 2, తుని పరిధిలో 5 దుకాణాలకు దరఖాస్తులు కోరారు. వీటికి సంబంధించి 52 గెజిట్ సీరియల్ నంబర్లను ప్రకటించారు.

దరఖాస్తుకు రూ.3 లక్షలు

ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్‌ రిఫండబుల్ ఫీజుతో పాటు రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ దుకాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రతి దుకాణానికి విడిగా దరఖాస్తు చేసి నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

1 వరకు దరఖాస్తులు.. 5న లాటరీ

దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 1 రాత్రి 12 గంటల వరకు గడువు ఇచ్చారు. అనంతరం దరఖాస్తులను పరిశీలించి లాటరీకి అర్హమైన వాటిని ఖరారు చేస్తారు. అక్టోబర్ 5న జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ నిర్వహించి దుకాణాల వారీగా లైసెన్సుదారులను ఎంపిక చేయనున్నారు.

ఎంపికైన వారికి 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు లైసెన్స్ కాలం వర్తించనుంది. జిల్లాలో ఇప్పటికే 133 దుకాణాలు రెన్యువల్ కాగా, మిగిలిన 38 దుకాణాలకు ఎవరికి లైసెన్సులు దక్కుతాయనేది అక్టోబర్ 5న జరిగే లాటరీలో తేలనుంది.