రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో గెలుపే లక్ష్యం కడప ఎంపీ
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయం మనదే కడప ఎంపీ
కార్యకర్తలకు అండగా నేనున్నా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
పులివెందుల మేజర్ న్యూస్:
భాకరాపురంలోని తన నివాసం వద్దకు వచ్చిన వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, వాటిని ఆయన అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త ధైర్యంగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వార్డు స్థాయి నుంచి పార్టీ శ్రేణులు ప్రజలతో నిరంతరం మమేకం కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.