BREAKING
సిమ్లా శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం: కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం ఎస్ఎస్ రాజమౌళి వారణాసి సినిమాపై ఎస్ఎస్ కార్తికేయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అగ్నిపర్వతంలా ఉంటుందంటూ! టాటా సన్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ పునర్నియామకానికి న్యాయపరమైన మద్దతు: నోయెల్ టాటా అభ్యంతరాలు తోసిపుచ్చిన బోర్డు గ్రేటర్ నోయిడాలో యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో: శుక్రవారం ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాలపూర్ గణపయ్యకు సబితమ్మ ప్రత్యేక పూజలు వర్షపు నీటిని ఒడిసిపట్టి జలాశయాలను నింపండి: అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం శంకర్‌పల్లి ‘కే రాజా’ నిమజ్జనోత్సవానికి హాజరైన నందమూరి దీపికా జానకిరామ్ కల్పసార్ ప్రాజెక్టుపై సాంకేతిక సహకారం కోసం భారత్, నెదర్లాండ్స్ మధ్య కీలక ఒప్పందాలు వెంకటేష్ మూవీ వాయిదా.. శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు కొత్త రిలీజ్ డేట్ తప్పదా? హిందు పండుగల పైన రాజకీయాలు చేస్తే సహించం.సింకారు శివాజీ ఢిల్లీ వర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినుల భద్రతపై ఏబీవీపీ ఆందోళన: వీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన ప్రజల సమస్యలు పరిష్కారం ప్రభుత్వ లక్ష్యం మంత్రి కందులు దుర్గేష్ గిన్నిస్ రికార్డ్‌లో అల్లు అర్జున్ ‘రాకా’ అరుదైన ఘనత.. 37 మందితో ఏకకాలంలో మోషన్ క్యాప్చర్! కూకట్‌పల్లి జ్యువెల్ హైట్స్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం.. రూ. 3,02,000లకు లడ్డును దక్కించుకున్న సూర ప్రసేన్‌జిత్, శరత్ బృందం! క్లోమ గ్రంథి క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే సరికొత్త రక్త పరీక్ష: శాస్త్రవేత్తల కీలక పరిశోధన

ముంపు ప్రాంతాల్లో డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య పర్యటన: రైతులకు, మత్స్యకారులకు తక్షణ పరిహారం అందించాలని డిమాండ్

Select Suryaa Now
ముంపు ప్రాంతాల్లో డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య పర్యటన: రైతులకు, మత్స్యకారులకు తక్షణ పరిహారం అందించాలని డిమాండ్

​పోలాకి, సెప్టెంబర్ 24, మేజర్ న్యూస్ :

తుఫాన్ ప్రభావంతో మండలంలోని పలు గ్రామాల్లో నీటమునిగిన పంట పొలాలను, ప్రభావిత ప్రాంతాలను యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండల పరిధిలోని సుసరాం, పిరియగ్రహం, అంబిరుపేట, గాతలవలస, డీఎల్‌పురం, బెలమర తదితర ముంపు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు.
​ఈ సందర్భంగా నీటమునిగిన పంటలను పరిశీలించి, తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. పంట నష్టం తీవ్రతను అన్నదాతలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మత్స్యకార గ్రామమైన గుప్పిడిపేట తీర ప్రాంతాన్ని సందర్శించి, స్థానిక మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
​అనంతరం డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య విలేకరులతో మాట్లాడుతూ, తుఫాన్ కారణంగా సర్వం కోల్పోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజుల్లో చేతికి అందాల్సిన పంటలు నీటిపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పారదర్శకంగా నష్టాన్ని అంచనా వేయాలని, ప్రతి బాధిత రైతుకూ పరిహారం అందించి ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు. అదేవిధంగా వేట నిషేధ కాలంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేసి తగిన తోడ్పాటు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
​ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, చింతు రాఘవరావు, నందుపల్లి పైడయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ దుంపల భాస్కరరావు, మండల అధ్యక్షులు కణితి కృష్ణారావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కల్లేపల్లి లక్ష్మణరావు, మండల బూత్ కమిటీ అధ్యక్షులు చింతాడ ఉమామహేశ్వరరావు, మండల బీసీ సెల్ అధ్యక్షులు చింతు రామకృష్ణ, మండల యూత్ అధ్యక్షులు రెంటికోట త్రినాథరావు, మండల ఉపాధ్యక్షులు సుంకరి రాంబాబు, ఎంపీటీసీ పైల మల్లేశ్వరరావు, మాజీ రాష్ట్ర డైరెక్టర్ లండ ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.