మంత్రాలయం భక్తులకు భద్రత హెచ్చరికలు
తుంగభద్రలో పెరిగిన నీటి ప్రవాహం
భక్తుల రక్షణకు శ్రీమఠం ముందస్తు భద్రతా చర్యలు
మంత్రాలయం: సూర్య ప్రతినిధి
మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం పెరగడంతో శ్రీమఠం అధికారులు భక్తులు రక్షణకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. నది పరివాహక ప్రాంతంలో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించి, భక్తులు నది ఒడ్డుకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.
పెరిగిన నీటి ప్రవాహం నేపథ్యంలో భక్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీ మఠం మేనేజర్ శ్రీనివాస మూర్తి సూచించారు. నది వైపు వెళ్లవద్దని, భద్రతా సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. నీటి ప్రవాహంపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు మైక్రోఫోన్ ద్వారా క్రమం తప్పకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.