జిల్లావ్యాప్తంగా పోలీసులు ‘వజ్ర ప్రహార్’ కార్డన్ సెర్చ్
అనంతపురం బ్యూరో
: జిల్లా ఎస్పీ పి.జగదీష్, ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోలీసులు శనివారం ‘వజ్ర ప్రహార్’ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లాలోని 27 ప్రాంతాల్లో 349 ఇళ్లను తనిఖీ చేసి, రికార్డులు సరిగా లేని 34 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
మాదకద్రవ్యాల కేసుల్లో గతంలో నిందితులుగా ఉన్న ముగ్గురితో పాటు 515 మంది అనుమానితులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలు, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.