జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థి షేక్ చాన్ బాబు
కామవరపు కోట, మేజర్ న్యూస్ మండలంలోని జీలకర్రగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 6 వ తరగతి కి చెందిన విద్యార్థి షేక్ చాన్ బాబు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థాయిలో పాఠశాల , కళాశాల విద్యార్థులకు జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో 'మహాత్మా గాంధీ సత్యం అహింసా విధానాలు - నేటి పరి స్థితులు ' అనే అంశంపై నిర్వహించిన ఆన్లైన్ చిత్ర లేఖనం పోటీ లో ప్రతిభ కనబరిచి పాఠశాల కు గర్వకారణంగా నిలిచాడు. విజేతలకు పెదనిండ్రకొలను మహాత్మా గాంధీ భవనం లో జరిగిన వేడుకలో సర్యోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాద్ రాజు చాన్ బాబు కు ప్రశంసాపత్రం, మెమెంటోతో పాటు బహుమతులను అండజేసి అభినందించారు.చాన్ బాబు సాధించిన విజయాన్ని, విద్యార్థికి మార్థదర్శకత్వం అందించిన గైడ్ టీచర్ పి. నాగరాజు మరియు అధ్యాపకుల కృషిని పాఠశాల ప్రధానోపాధ్యాయిని వి. భారతీదేవి, SMC సభ్యులు గ్రామస్తులు అభినందించారు.
సుభాష్ కామవరపుకోట