BREAKING
మున్సిపాలిటీ పై వై సి పి జెండా ఎగరేయడమే లక్ష్యం. మాజీ ఎంపీ తలారి రంగయ్య. గోపాలపురంలో గురుకుల విద్యార్థులకు మహిళా భద్రతపై అవగాహన, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచన చెన్నైలో తుదిశ్వాస విడిచిన విలక్షణ సినీ సృష్టికర్త ముంగండ - ఇసుకపూడి రహదారి పనులు వేగవంతం హైస్కూల్ గ్రౌండ్‌లో రొయ్యల లోడింగ్: దుర్వాసనతో విద్యార్థుల అవస్థలు స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర అవార్డు అందుకున్న మాచవరం పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణకు ఘన సన్మానం విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు కొత్త భవనాలు సిద్ధం 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి... మాజీ ఎంపీ చింతా అనురాధ... పే స్కేల్ అమలు, నామినీ విఆర్ఎ ల రెగ్యులరైజ్, ప్రమోషన్ల కల్పన కోసం విఆర్ఎ ల ఆర్తనాదం రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు రోజువారీ జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునే సులభమైన మార్గాలు.. మానసిక ప్రశాంతత కోసం ఇవి పాటించండి అధికంగా చక్కెర తింటున్నారా.. శరీరంలో ప్రాణాంతక మార్పులు ఖాయం! జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా టాలీవుడ్‌లో కొరియన్ డ్రామాల జోరు.. భారత్‌‌లో విపరీతంగా పెరిగిన మహిళా ప్రేక్షకుల సంఖ్య మనసున్న... మా రాజు వాసంశెట్టి సత్యం... కంచుమర్తి బాబురావు

జర్నలిస్టు సమస్యలు పరిష్కరించాలి.

Select Suryaa Now
జర్నలిస్టు సమస్యలు పరిష్కరించాలి.
  •  గాంధీ విగ్రహానికి జర్నలిస్టుల వినతిపత్రం

నరసన్నపేట, అక్టోబర్ 2 మేజర్ న్యూస్: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తోట చంద్రమోహన్ దేవ్ ఆరోపించారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన ఆధ్వర్యంలో జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా చంద్రమోహన్ దేవ్ మాట్లాడుతూ జర్నలిస్టులకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ, జర్నలిస్టులకు కల్పిస్తున్న ప్రయాణ సౌకర్యాన్ని జిల్లాకే పరిమితం చేశారని అన్నారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు ఇతర సంక్షేమ సౌకర్యాల కల్పనలోనూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రోత్సాహకాలు అందించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుండగా, జర్నలిస్టుల ఉపాధి, సంక్షేమ సమస్యల పరిష్కారంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతోందని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు కనీస వేతనం అమలు చేయాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ మహాత్మా గాంధీ విగ్రహానికి, నరసన్నపేట తహసిల్దార్ సత్యనారాయణకు  వినతిపత్రం సమర్పించారు.
కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.