జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఐక్యకార్యాచరణ : మెగా కుటుంబానికి అండగా నిలుస్తున్న మదనపల్లె ప్రముఖులు : పార్టీ అభివృద్ధితోపాటు కూటమి బలోపేతానికి కృషిచేస్తామని వెల్లడి
మదనపల్లె,మేజర్ న్యూస్ : ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి జనసేన పార్టీ వరకు మెగా కుటుంబానికి అండగా నిలుస్తూ,పార్టీకి తమ మద్ధతును అందిస్తున్న మదనపల్లె నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు జనసేన పార్టీ బలోపేతానికి నడుం బిగించారు.ఈ మేరకు గురువారం మదనపల్లె కమ్మవీధిలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో బీపీఎల్ విజయ్ కుమార్,రాజ్ భవన్ రాజా,విజయలక్ష్మి ఫర్నిచర్ భాస్కర,పెట్రోల్ బంక్ సూరి,శ్రీనివాస సూపర్ మార్కెట్ శ్రీనివాస్,రన్ టీవి సీఈఓ,మదనపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు సిరివేలు చరణ్ కుమార్,లీలాకర్,శ్రీరామ రామాంజనేయులు,శ్రీరామహరిహరన్ తదితరులు పాల్గొన్నారు.జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్,మదనపల్లె నియోజకవర్గ ఇంచార్జి గంగారపు రాందాస్ చౌదరి,మదనపల్లె ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాంలతో కలిసి పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.జనసేన పార్టీ అభివృద్ధితోపాటు కూటమిని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరిమాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ప్రజల ఆదరణతో నిరంతరం బలోపేతం అవుతుందన్నారు.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం మన ప్రాంతంలో జనసేన పార్టీ బలంగా నిలిచిందని పేర్కొన్నారు.భవిష్యత్తులో మన మధ్య ఉన్న చిన్నచిన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టి,ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.పార్టీ అభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతతో పనిచేయాలని,జనసేన పార్టీ బలోపేతం ద్వారా కూటమి విజయానికి సహకారం అందించాలని కోరారు.రాందాస్ చౌదరి ఇచ్చిన పిలుపునకు సమావేశంలో పాల్గొన్న వారు మద్ధతు తెలిపారు.పార్టీ అభివృద్ధికి తమవంతు కృషిచేస్తామని,భవిష్యత్తులో కూడా జనసేన పార్టీకి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి