జల జీవన్ మిషన్ సభ విజయవంతానికి కూటమి శ్రేణుల సన్నాహాలు
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:
ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరులో పాల్గొననున్న జల జీవన్ మిషన్ ప్రారంభోత్సవ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కూటమి శ్రేణులు సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా శుక్రవారం స్థానిక భారత్ ఫంక్షన్ హాల్‌లో కూటమి నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, షేక్ కార్పొరేషన్ చైర్మన్ డా. వి.ఎస్. ముక్తియార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని నిర్వహించనున్న బహిరంగ సభకు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డా. వి.ఎస్. ముక్తియార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాలు, వార్డుల వారీగా సమన్వయం చేసుకుని ప్రజలను సభకు తరలించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. జల జీవన్ మిషన్ ద్వారా ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని సభకు ప్రజల తరలింపు, గ్రామాలు, వార్డుల వారీగా సమన్వయం, ఇతర ఏర్పాట్లపై చర్చించారు.