జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు
కడియం: మేజర్ న్యూస్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సౌత్ జోన్ డీఎస్పీ ఏ. శివప్రియ, కడియం ఎస్ఐ బి. నాగ దుర్గ ప్రసాద్, ఏఎస్ఐ రమణ ఆధ్వర్యంలో కడియం మండలంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి,భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం
జాతీయ రహదారిపై పొట్టిలంక జంక్షన్ వద్ద రాజమహేంద్రవరం వైపు ఏర్పాటు చేసిన చెక్పోస్టును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టేందుకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతూ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.