జాతిపితకు ... లాల్ బహదూర్ కు జయంతి నివాళి.
పాతపట్నం అక్టోబర్ 2,మేజర్ న్యూస్:
మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విక్టరీ పాఠశాలలో గాంధీ విగ్రహానికి పూల మాలలతో నివాళులు ఘటించారు. ఏవో శ్రీనివాస్ బాపూజీ సత్య సంధత, అహింసా మార్గం మరియు శాస్త్రి నిరాడంబరత గురించి పిల్లలకు వివరించారు. ఏ పదవీ ఆశించని వారు బాపూజీ అని, పదవి చేబట్టినా విలువలతో బ్రతికిన వారు శాస్త్రీజి అని, వారు భారత జాతికి ఎలా ఆదర్శ ప్రాయమయ్యారో తెలిపారు. పిల్లలు కొన్ని దేశ భక్తి గేయాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.