జాతిపిత కు వైసీపీ ఘనంగా నివాళులు.
కొత్తూరు అక్టోబర్ 02(మేజర్ న్యూస్) జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి వైసీపీ నేత రాష్ట్ర బిసి సెల్ సంయుక్త కార్యదర్శి చింతాడ సూర్యనారాయణ,మండల పార్టీ అధ్యక్షులు గండివలస ఆనందరావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీ ఆశయాలు
ప్రతిఒక్కరు ఆచరించాలని విజ్ఞప్తి చేశారు.ప్రతీ ఒక్కరు శాంతి ని అలవరచుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ యంపిపి సవర సావిత్రి,నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు ఆగతముడి నాగేశ్వరరావు,దూలి అప్పన్న,మాజీ సర్పంచ్ లు ఆగతముడి రంజిత్ ,నాసు బాలకృష్ణ , మాజీ యంపిటిసి వి లక్ష్మీనారాయణ, టి కృష్ణ మోహన్, పాపారావు, సవర రమేష్ తదితరులు పాల్గొన్నారు