BREAKING
సైనిక సన్నద్ధతలో ఆశ్చర్యకరమైన వ్యూహాలు, సాంకేతిక ఆధిక్యతే కీలకం పొన్నూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత...... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పలమనేరు గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థులకు పలు విజ్ఞాన కార్యక్రమాలు అండర్-19 ఆసియాకప్‌ ఫైనల్‌కు భారత్.. అంతరిక్ష రంగంలో భారత్ మరో మైలురాయి తిరుపతిలో సెమీ కండక్టర్స్ పార్క్ అభివృద్ధికి సైయంట్ సుముఖత. -సైయంట్ ప్రెసిడెంట్ నరసింహంతో మంత్రి నారా లోకేష్ సమావేశం శివాలయంలో ఎమ్మెల్యే జన్మదినోత్సవం ఈ నెల 15న హైదరాబాదులో జరిగే "హలో నేతకాని చలో ఉస్మానియా" పోస్టర్ల విడుదల కెమెరాలు తక్కువగా, అనుబంధాలు బలంగా ఉండేవి...ప్రధాని మోదీ జర్నలిస్టులతో జ్ఞాపకాలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ 2026లో అధికార పార్టీ ఒత్తిళ్లను ఎదుర్కొని వైసీపీ వీరోచిత పోరు... 16న ఫిలిప్పీన్స్ పర్యటనకు ప్రధాని మోడీ 16న ఫిలిప్పీన్స్ పర్యటనకు ప్రధాని మోడీ జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలి* *సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అరటి సాగులో జీవ నియంత్రణ కారకాలపై అవగాహన

ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల స్పెషల్ టెట్‌కు ఆటంకాలు సృష్టించవద్దు.. ఉపాధ్యాయుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి.. గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు గుజ్జుల శివయ్య, ప్రధాన కార్యదర్శి డెగావత్ రవీంద్రనాథ్

Select Suryaa Now
ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల స్పెషల్ టెట్‌కు ఆటంకాలు సృష్టించవద్దు..  ఉపాధ్యాయుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి..  గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు గుజ్జుల శివయ్య, ప్రధాన కార్యదర్శి డెగావత్ రవీంద్రనాథ్

అనంతపురం విద్య మేజర్ న్యూస్:-ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక స్పెషల్ టెట్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా సజావుగా కొనసాగించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు గుజ్జుల శివయ్య, ప్రధాన కార్యదర్శి డెగావత్ రవీంద్రనాథ్ కోరారు.
25 నుంచి 30 ఏళ్లుగా ప్రభుత్వ విద్యారంగంలో పనిచేస్తూ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి సేవలందిస్తున్న ఉపాధ్యాయుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యేక టెట్ నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చే అభ్యర్థులతో సమానంగా నిబంధనలు వర్తింపజేయడం ఇబ్బందికరమని పేర్కొన్నారు. ప్రత్యేక టెట్‌కు తగిన సమయం, శిక్షణ, స్పష్టమైన మార్గదర్శకాలు కల్పించాలని కోరారు.
ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సుదీర్ఘ సేవలు, అనుభవాన్ని గుర్తించి మానవతా దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలని, ఎలాంటి న్యాయపరమైన పరిపాలనా పరమైన ఆటంకాలు లేకుండా ప్రత్యేక టెట్ నిర్వహించాలని రవీంద్రనాథ్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్