ఇందుకూరుపేట జడ్పీటీసీ అభ్యర్థిగా బట్టేపాటి నరేంద్ర రెడ్డి
నెల్లూరు, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో భాగంగా మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నేడు నెల్లూరులోని తన నివాసంలో ఇందుకూరుపేట మండలానికి చెందిన పలువురు అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఇందుకూరుపేట మండల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా బట్టేపాటి నరేంద్ర రెడ్డిని, జగదేవిపేట సర్పంచ్ అభ్యర్థిగా పుచ్చలపల్లి సుబ్బరామిరెడ్డిని, కుడితిపాలెం ఎంపీటీసీ అభ్యర్థిగా గున్నం కిషోర్ బాబుని, జగదేవిపేట ఎంపీటీసీ అభ్యర్థిగా మొలతాటి ఆదిశేషయ్యని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఇందుకూరుపేట మండలం నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, ఇందుకూరుపేట మండల పార్టీ అధ్యక్షులు మవులూరు శ్రీనివాసులురెడ్డి, APLDA ఛైర్మన్ గొల్లపల్లి విజయకుమార్తో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.