హోంమంత్రి చేతుల మీదుగా మెయిన్ రోడ్ సెంట్రల్ లైటింగ్,సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన.
పాయకరావుపేట సెప్టెంబర్ 30 మేజర్ న్యూస్.
రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గురువారం పాయకరావుపేటలో పర్యటనించనున్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పాయకరావుపేట ప్రధాన రహదారి మెయిన్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు.ఈ నేపద్యంలో అక్టోబర్ 1వ తేది గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మెయిన్ రోడ్డుకు సంబంధించిన సెంట్రల్ లైటింగ్,సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేయనున్నారు.ఈ సందర్భంగా బుధవారం కూటమి నాయకులు శంకుస్థాపన స్థలాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్,రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరి,టిడిపి మండల అధ్యక్షుడు చించలపు పద్దు, పట్టణ అధ్యక్షుడు యాళ్ళ వరహాల బాబు, పాండురంగ స్వామి దేవస్థానం చైర్మన్ మజ్జూరి నారాయణరావు,కంకిపాటి వెంకటేశ్వరరావు,జనసేన పట్టణ అధ్యక్షుడు ఆచంట దొర,మల్లపురెడ్డి రమాకుమారి,యూత్ అధ్యక్షుడు గొల్లపల్లి నాగు,పెదిరెడ్డి పండు, చిరుకూరి పేర్రాజు,వేములపూడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.