హాకీని ప్రోత్సహించాలి గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీయాలి: ప్రభాకర్‌రెడ్డి
హాకీని ప్రోత్సహించాలి
గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీయాలి: ప్రభాకర్‌రెడ్డి
నార్పల: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాలని నార్పల బీజేపీ మండల అధ్యక్షుడు వడ్డీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నార్పల మండలంలో హాకీ క్రీడను ప్రోత్సహించే ఉద్దేశంతో విద్యార్థులు, క్రీడాకారులకు అవసరమైన హాకీ క్రీడా సామగ్రిని ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా కార్యక్రమాల స్ఫూర్తితో యువత క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం, క్రీడా సామగ్రి అందిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటే అవకాశం ఉంటుందని అన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుకు సాగాలని సూచించారు.
కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కాశీ నాగేంద్ర పాల్గొన్నారు.