BREAKING
అనంతపురం నగర అభివృద్ధికి రూ.3.84 కోట్లతో పనులకు శ్రీకారం 30–40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాం: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కోటి రూపాయలు శ్రీదేవి కంటే ముందే ఆ అమ్మాయిని 10 ఏళ్లు ప్రేమించా: తొలి ప్రేమపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు! దసరా సందర్భంగా మున్సిపల్ కార్మికులకు వస్త్రాల పంపిణీ క్రీడల ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి మియాపూర్ సీఐ జయరాంను కలిసిన మాలకొండ రాయుడు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారణలో దర్శనమిచ్చిన నల్ల పోచమ్మ అమ్మవారు ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు బాలీవుడ్‌లో హింసాత్మక చిత్రాలదే రాజ్యమనేది ఒక భ్రమ మాత్రమే: నటుడు గుల్షన్ దేవయ్య వ్యాఖ్యలు! కదిరిలో వైసీపీలో చేరిన టీడీపీ నాయకుడు బిస్కెట్ బాబా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌.. టీడీపీ నిబద్ధత రాజమహేంద్రవరం చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి విమానాశ్రయంలో ఘన స్వాగతం.. కపిలేశ్వరపురంలో హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభం వచ్చే నెలలో కల్లూరు గూడెం పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరం వైసీపీ నాయకుడు గొల్ల బసవరాజుకు ఉమామహేశ్వర నాయుడు నివాళులు దహన సంస్కారాల ఖర్చుల కోసం రూ.5 వేల ఆర్థిక సాయం సిజిపి నిరసనలపై మండిపడ్డ కంగనా రనౌత్: దేశాన్ని అస్థిరపరిచేందుకు దేశద్రోహ శక్తుల కుట్ర అంటూ ఆగ్రహం!

గుడివాడలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: తొలిరోజు 'బాలాత్రిపురసుందరి'గా అమ్మవారి దర్శనం

Select Suryaa Now
గుడివాడలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: తొలిరోజు 'బాలాత్రిపురసుందరి'గా అమ్మవారి దర్శనం

గుడివాడలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: తొలిరోజు 'బాలాత్రిపురసుందరి'గా అమ్మవారి దర్శనం

నందివాడ - సూర్య ప్రతినిధి : గుడివాడ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన బంటిమిల్లి రోడ్డు లోని శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజైన ఆదివారం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయానికి పోటెత్తిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రేపు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ:

ఉత్సవాల రెండో రోజైన సోమవారం (రేపు) అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ధర్మకర్తల కమిటీ చైర్మన్ పట్టపు చిన్న, ఈవో కందుల గోపాలరావు సంయుక్తంగా తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఆవరణలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.