BREAKING
వికలాంగుల హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వంపై దండయాత్ర: గిద్దె రాజేష్ కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి, సంక్షేమం( కళ్యాణదుర్గంలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ వాహనాల రికార్డుల తనిఖీ.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు శ్రీకామాక్షి చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ప్రారంభం ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు.. సోమవారం ఖమ్మం అల్లీపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు పీఎం ఈ-విద్య శిక్షణ పూర్తి చేసిన ఉపాధ్యాయులు కరెంటు కోతలతో ఎండిన వరి పంట.. ఆదుకోవాలని రైతు వేడుకోలు తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి తెలంగాణ అభివృద్ధి వరకు కేసీఆర్ చెరగని ముద్ర పోరాటం కొనసాగిస్తాం కలెక్టర్ ను సన్మానించిన మంత్రి కోమటిరెడ్డి... బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి ఎన్టీఆర్ పునాది. కరెంటు కోతలతో ఎండిపోతున్న పంటలు – రైతుల గోడు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉరవకొండపై నివేదిక

గ్రంథాలయాలను విద్యార్థులు వినియోగించుకోవాలి గ్రంధాలయ నిర్వాహకులు నల్ల మధుసూదనరావు

Select Suryaa Now
గ్రంథాలయాలను విద్యార్థులు వినియోగించుకోవాలి  గ్రంధాలయ నిర్వాహకులు నల్ల మధుసూదనరావు

గరుగుబిల్లి, మేజర్ న్యూస్: చదవడం మాకిష్టం కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమమని ఈమేరకు గ్రంథాలయంలో నిర్వహిస్తున్న చదవడం మాకిష్టం కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని గరుగుబిల్లి శాఖా గ్రంధాలయం నిర్వాహకులు నల్ల మధుసూదనరావు పేర్కొన్నారు.మండల కేంద్రంలోని శాఖా గ్రంధాలయంలో ఆదివారం ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు చదవడం మాకిష్టం కార్యక్రమమును నిర్వహించారు.చదవడం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా పధ్యములు, గద్యములు,కథలు చెప్పడం తోపాటు క్విజ్ పోటీలు స్టోరీ టెల్లింగ్ లో భాగముగా ఆదికవి నన్నయ్య జీవిత చరిత్ర విద్యార్థి చదవగా విద్యార్థులు వినడం జరిగింది.స్పోకెన్ ఇంగ్లీష్ మరియు క్రీడా పోటీల్లో భాగముగా ఈరోజు క్యారం బోర్డు, లూడో,చదరంగం బిజినెస్ మొదలగు ఆటలు ఆడించడం జరిగిందని శాఖా గ్రంధాలయం నిర్వాహకులు నల్ల మధుసూదనరావు పేర్కొన్నారు.అదే విధముగా  పుస్తక పఠనము ద్వారా మనోవికాసం పెంచడం జ్ఞానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి విజయనగరం పార్వతిపురం మన్యం జిల్లాల గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు గ్రంథాలయంలో ప్రతి ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గ్రంథాలయ నిర్వాహకులు మధుసూదనరావు వెల్లడించారు.ఈకార్యక్రమంలో   అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.