BREAKING
దుర్గామాత ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్సై గిరి నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మద్దతు ప్రకటించిన జర్మనీ నూతన ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు అధికారుల వైఫల్యంతోనే కర్నూలు జిల్లాకు కరువు మండలాలు రాలేదు వైభవంగా ప్రారంభమైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు. మాజీ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ భౌతిక కాయానికి నివాళులర్పించిన బొక్క నరసింహారెడ్డి జర్మనీలో విదేశీ ఇన్వెస్టర్లలో ఆందోళన..డ్యుయిష్ బ్యాంక్ చీఫ్ హెచ్చరిక అనారోగ్యంతో బాధపడుతున్న కామసాని శేషిరెడ్డి పరామర్శ ఓటీటీలో ట్రెండ్ అవుతున్న 'మారెమ్మ'.. ఏకకాలంలో రెండు ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్! శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి అలంకరణలో అమ్మవారు మృతుల కుటంబాలను పరామర్శించిన ఎమ్యెల్యే జిబౌటి-యెమెన్ సముద్రంలో మునిగిన పడవ..15 మంది పిల్లలతో సహా 109 మంది మృతి కూటమి పాలనలో ప్రజల అస్తులకు రక్షణ కరువు – రెండున్నరేళ్లుగా అనంతపురంలో దౌర్జన్యాలు – స్థానిక ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి గెలవాలని ప్రయత్నాలు – కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి నేతలకు ప్రజలు బుద్ధి చెప్పాలి – వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి బోరు మోటారు స్టార్టర్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుదాఘాతం.. రైతు మృతి ఊపిరితిత్తుల్లో చిన్న గడ్డ తొలగింపు కోసం శస్త్రచికిత్స చేయించుకోనున్న పోప్ లియో

బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి ఎన్టీఆర్ పునాది.

Select Suryaa Now
బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి ఎన్టీఆర్ పునాది.

పీలేరు , అక్టోబర్ 11, మేజర్ న్యూస్:స్వర్గీయ నందమూరి తారక రామారావు బీసీలకు స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించి రాజకీయ ప్రాతినిధ్యానికి చారిత్రాత్మక పునాది వేశారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ పేర్కొన్నారు. ఆ మహానేత ప్రారంభించిన బీసీ సాధికారత ప్రయాణాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్లి రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారని గుర్తుచేశారు. బీసీలకు రాజకీయంగా గుర్తింపు, సామాజికంగా గౌరవం, ఆర్థికంగా భరోసా కల్పించడంలో తెలుగుదేశం పార్టీది చారిత్రాత్మక పాత్ర అని స్పష్టం చేశారు.

బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాగల ఆనంద్ గౌడ్ తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, వారి చట్టపరమైన రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కొన్ని స్థానిక సంస్థల పదవుల్లో రిజర్వేషన్లు 34 శాతం కంటే తక్కువగా ఉన్న చోట్ల కూటమి పార్టీల తరఫున బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గడం వల్ల బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. బీసీలకు రాజకీయ అవకాశాలు పెంచడం ద్వారా వారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పమని అన్నారు.

అలాగే వడ్డెరలకు మైనింగ్ లీజుల్లో 10 శాతం ప్రాధాన్యత, గీత కార్మికులకు ఎక్సైజ్ షాపుల కేటాయింపుల్లో 10 శాతం ప్రాధాన్యత, నాయీ బ్రాహ్మణులకు దేవాలయాల్లో భృతిని రూ.25 వేలకు పెంపు, నేతన్నలకు ఉచిత విద్యుత్, సెలూన్లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి చర్యలు వివిధ బీసీ వృత్తి వర్గాలకు అండగా నిలుస్తున్నాయని వివరించారు.

“జయహో బీసీ” అనేది కేవలం నినాదం కాదు. ఎన్టీఆర్ వేసిన పునాదిపై చంద్రబాబు నాయుడు బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారతను ముందుకు తీసుకెళ్తున్నారనడానికి నిదర్శనం. బీసీల అభ్యున్నతి, ఆత్మగౌరవం, సమాన అవకాశాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని రాగల ఆనంద్ గౌడ్ స్పష్టం చేశారు.