పోరాటం కొనసాగిస్తాం
న్యూ ఢిల్లీ :దేశంలో రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటాన్ని ఆపేది లేదని ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రతిపక్షాల నిరసనలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ తమ ఆందోళనలను కొనసాగిస్తామని ప్రకటించారు.
ఈ క్రమంలోనే రేపు (సోమవారం) సాయంత్రం 4:00 గంటల నుంచి 5:00 గంటల మధ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌తో ప్రతిపక్ష నాయకుల బృందం సమావేశం కానుంది. తాము ఇప్పటికే సీజేఐకి లేఖలు రాశామని, ఈ భేటీలో దేశంలో ప్రస్తుతం నెలకొన్న అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు, ప్రతిపక్షాల భయాలు, ఆందోళనలను ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లి వివరిస్తామని ఖర్గే పేర్కొన్నారు. ఎలాంటి డిమాండ్లు చేయకుండా, కేవలం విన్నపాలను మాత్రమే సమర్పిస్తామని ఆయన వెల్లడించారు.