BREAKING
నూతన ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు అధికారుల వైఫల్యంతోనే కర్నూలు జిల్లాకు కరువు మండలాలు రాలేదు వైభవంగా ప్రారంభమైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు. మాజీ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ భౌతిక కాయానికి నివాళులర్పించిన బొక్క నరసింహారెడ్డి జర్మనీలో విదేశీ ఇన్వెస్టర్లలో ఆందోళన..డ్యుయిష్ బ్యాంక్ చీఫ్ హెచ్చరిక అనారోగ్యంతో బాధపడుతున్న కామసాని శేషిరెడ్డి పరామర్శ ఓటీటీలో ట్రెండ్ అవుతున్న 'మారెమ్మ'.. ఏకకాలంలో రెండు ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్! శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి అలంకరణలో అమ్మవారు మృతుల కుటంబాలను పరామర్శించిన ఎమ్యెల్యే జిబౌటి-యెమెన్ సముద్రంలో మునిగిన పడవ..15 మంది పిల్లలతో సహా 109 మంది మృతి కూటమి పాలనలో ప్రజల అస్తులకు రక్షణ కరువు – రెండున్నరేళ్లుగా అనంతపురంలో దౌర్జన్యాలు – స్థానిక ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి గెలవాలని ప్రయత్నాలు – కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి నేతలకు ప్రజలు బుద్ధి చెప్పాలి – వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి బోరు మోటారు స్టార్టర్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుదాఘాతం.. రైతు మృతి ఊపిరితిత్తుల్లో చిన్న గడ్డ తొలగింపు కోసం శస్త్రచికిత్స చేయించుకోనున్న పోప్ లియో రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి నిరంతర కృషి స్థానిక ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలి నూతిమడుగులో పార్టీ ఐడీ కార్డుల పంపిణీ.. శ్రేణులకు తలారి రంగయ్య దిశానిర్దేశం

ఉరవకొండపై నివేదిక

Select Suryaa Now
ఉరవకొండపై నివేదిక

ఉరవకొండపై సీఎంకు నివేదిక 

ఏపీ స్టేట్  బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి

ఉరవకొండ నియోజకవర్గ అభివద్ది పనులను వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ సీఎం చంద్రబాబుకు అందించారు. కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలో జరిగిన సమగ్ర అభివృద్దిని వివరిస్తూ పుస్తకాన్ని ప్రచురించినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రోగ్రెస్ కార్డులా ఆయా శాఖల్లో జరిగిన అభివృద్ది కార్యక్రమాలను క్లుప్తంగా వివరిస్తూ ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఉరవకొండకు తాగునీరు, హంద్రీ నీవా కాలువ వెడల్పుతో జరిగిన లబ్ది, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పల్లెల్లో సిమెంట్ రోడ్లు, నూతన భవనాల మంజూరు వంటి కార్యక్రమాలను వివరిస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించారు. రెండేళ్లలో గ్రామస్థాయిలో తీసుకువచ్చిన అన్ని మార్పులను ఇందులో పొందుపరిచినట్లు ఉరవకొండ ఎమ్మెల్యే, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. నియోజకవర్గాల్లో అభివృద్ది పనులు చేయడంతో పాటు....ఆయా పనుల వివరాలను కూడా నిత్యం ప్రజలకు వివరించాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. గత ప్రభుత్వంలో విధ్వంసానికి, కూటమి ప్రభుత్వంలో వికాసానికి మధ్య తేడాను వివరించేలా ఎమ్మెల్యేలు ఈ తరహా నివేదికలను, ప్రోగ్రెస్ కార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులు, లిఫ్ట్ ప్రాజెక్టులు మంజూరు చేసి నియోజక అభివృద్దికి సహకరిస్తోన్న ముఖ్యమంత్రికి మంత్రి కేశవ్ ధన్యవాదాలు తెలిపారు.