గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా నూతన సర్పంచులు పనిచేయాలి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ప్రజా సంక్షేమ ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా సర్పంచులు పని చేయాలి
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా , గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సూచించారు. శనివారం సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సర్పంచ్ అభ్యర్థులను అభినందించారు. గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా