BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

గూడూరు మండలంలో పోలీసుల రూట్‌ మార్చ్‌

Select Suryaa Now
గూడూరు మండలంలో పోలీసుల రూట్‌ మార్చ్‌

గూడూరు, మేజర్‌న్యూస్‌
గూడూరు మండల పరిధిలోని సమస్యాత్మక గ్రామాల్లో డిఎస్‌పి నరసింహమూర్తి ఆద్వర్యంలో రూట్‌ మార్చ్‌ నిర్వహించారు. శుక్రవారం ఉదయం గూడూరు రూరల్ సీఐ, గూడూరు 1వ టౌన్ సీఐ, గూడూరు 2వ టౌన్ సీఐ చిల్లకూరు, కోట స్టేషన్ల అధికారులు, 40 మంది పోలీసు సిబ్బంది భాగస్వామ్యంతో గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్యంత సున్నితమైన మంగళాపురం, వెడిచెర్ల గ్రామాలలో రూట్ మార్చ్ నిర్వహించారు. ఈ రూట్ మార్చ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాల ప్రదేశాలను కూడా తనిఖీ చేశారు. త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూసుకోవాలని, ఎలాంటి భయం లేదా వివాదాలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మరియు శాంతిభద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని గ్రామస్తులకు సూచించరు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొన్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆపరేషన్ త్రిశూల్ గురించి కూడా గ్రామస్తులలో అవగాహన కల్పించారు.