BREAKING
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది – ఎంపీ మల్లు రవి 21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం డిసిసి అధ్యక్షురాలికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బికెఆర్ సత్కారం గోదావరిలో మృతి చెందిన చేపలను పరిశీలించినవిప్ నాయకర్ కోర్‌వీవ్ సిఈఓ సంచలన నిర్ణయం వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కావలి రామ సీత నామినేషన్ ఇండోనేషియా స్టాక్ మార్కెట్‌కు గ్లోబల్ షాక్ అమలాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి సమన్వయ సమావేశం: ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే ఆనందరావుల నేతృత్వంలో సీట్ల ఒప్పందం మోక్షపురి కంచిలో మంగళరూపిణి - కామాక్షమ్మ (అష్టాదశ శక్తిపీఠాలలో 2వది) వైఎస్సార్‌సీపీలో చేరిన జెట్టి అరుణ్ రేపల్లెలో 13 వార్డులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన శ్రీ సరస్వతి మాత అలంకరణలో దర్శనమిస్తున్న వన మైసమ్మ తల్లి. జెమినీ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌కు ఎదురుదెబ్బ భూగర్భ జలాల పెంపునకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు దోహదం:డీపీఓ జయసుధ

గంజాయి పట్టివేత: ఇద్దరు అరెస్టు..!! ---వ్యాన్‌ స్వాధీనం

Select Suryaa Now
గంజాయి పట్టివేత: ఇద్దరు అరెస్టు..!! ---వ్యాన్‌ స్వాధీనం

ఆనందపురం, సూర్య : మండలంలోని దుక్కువానిపాలెం టోల్‌గేటు సమీపంలో బుధవారం అర్ధరాత్రి అధికారులు గంజాయిని పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ వ్యాన్‌ను అడ్డుకుని పరిశీలించగా, అందులో 150 ప్యాకెట్ల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
రెవెన్యూ, నిఘా విభాగం అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ గంజాయి పట్టుబడినట్లు తెలిసింది. పట్టుబడిన గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులతో పాటు వ్యాన్‌ను ఆనందపురం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి పరిమాణం, దాని విలువ, నిందితుల వివరాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

 

రిపోర్టర్ : శ్రీనివాస్, ఆనందపురం, విశాఖపట్నం.