ఘనంగా సీమంతం కార్యక్రమం
ఆత్మకూరు, మేజర్ న్యూస్: ఆత్మకూరు పట్టణంలోని బీసీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో గురువారం గర్భిణీలకు సీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి ఉత్సవం కార్యక్రమంలో భాగంగా ఐ సి డి ఎస్ సి డి పి ఓ పి.సునీలత పాల్గొన్నారు.అంగన్వాడి కేంద్రాన్ని ఆకర్షణీయంగా అలంకరించి అందర్నీ ఆహ్వానించి పౌష్టికాహార ప్రదర్శనను ఏర్పాటు చేశారు. పౌష్టికాహారం గురించి సిడిపిఓ సునీలత అందరికీ వివరించి అవగాహన కల్పించారు. అంగన్వాడి ఉత్సవం కార్యక్రమాల గురించి ఆమె వివరించారు. ఐసిడిఎస్ సేవలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా లభించే పౌష్టికాహారం, చిన్నారుల పూర్వ ప్రాథమిక విద్యా అంశాల గురించి సునీలత వివరించి అందరికీ అవగాహన కల్పించి ఐసిడిఎస్ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జి. కస్తూరి, అంగన్వాడీ కార్యకర్త జి. సుప్రజ, పలువురు గర్భిణీలు, బాలింతలు,మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.