గౌకనపల్లిలో తాగు నీటి సమస్యకు పరిష్కారం
నంబులపూలకుంట మండలంలోని గౌకనపల్లి గ్రామంలో పైప్లైన్ లీకేజీతో ఏర్పడిన తాగునీటి సమస్యపై బీజేపీ రాష్ట్ర నాయకులు, కదిరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ సమివుల్లా స్పందిం చారు. వెంటనే కొత్త పైప్లైన్ ఏర్పాటు చేయించి సమ స్యను పరిష్క రించారు. దీంతో గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్డీయే నాయకులు డీలర్ సుబ్బ రాయుడు, పాలెం గంగులప్ప, టి. ఓబులేసు, రేపని నారాయణ, మోరం రామాంజుల రెడ్డి, మొగల్ షమివుల్లా, లక్ష్మయ్య, నారా యణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
కదిరి సూర్య రిపోర్టర్ :మాధవ