గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్.
గన్నవరం, మేజర్ న్యూస్.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. విజయ్ జోసెఫ్ మంగళవారం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ‘సీఎం.. సీఎం’, ‘దళపతి.. దళపతి’ అంటూ నినాదాలు చేయడంతో విమానాశ్రయ పరిసరాలు సందడిగా మారాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో అమరావతికి బయలుదేరిన విజయ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కీలక భేటీ కానున్నట్లు సమాచారం. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని విజయ్ దర్శించుకోనున్నట్లు తెలిసింది. ఆయన పర్యటన నేపథ్యంలో విమానాశ్రయం వద్ద పోలీసులు, భద్రతా సిబ్బంది ఏర్పాట్లు చేపట్టారు. అభిమానుల రాకతో గన్నవరం విమానాశ్రయం వద్ద సందడి నెలకొంది.
సూర్య ప్రతినిధి:: గుర్రం ప్రసాద్, గన్నవరం, కృష్ణా జిల్లా.