గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు
విద్యార్థి దశ నుంచే గాంధీజీ జీవిత సందేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలి...మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు
రామగిరిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
రామగిరి మేజర్ న్యూస్ : విద్యార్థులు విద్యార్థి దశ నుంచే గాంధీజీ జీవిత సందేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అని మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రామగిరి మండలంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆదర్శంగా తీసుకోని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చిన్నతనం నుంచే గాంధీజీ జీవిత సందేశాన్ని అలవర్చుకుని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.