BREAKING
డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్మందుల సంధ్య కుటుంబానికి పరామర్శ రణ్‌వీర్ సింగ్ ధురంధర్ సినిమా స్పై జోనర్ ప్రమాణాలను మార్చేసింది: నటి నిమ్రత్ కౌర్ ప్రశంసలు రాష్ట్ర అధ్యక్షుడికి సాదర ఎంఎల్‌ఏ స్వాగతం నేడు పలు కార్యక్రమాలలో పాల్గొననున్న గొట్టిపాటి లక్ష్మి మొదటి నెల జీతంతో వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ సర్వే పనుల పురోగతిని వేగవంతం చేయాలి* విద్యతో పాటు సేవలోనూ ఆదర్శం. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు సంధ్యారాణికి ఘన సన్మానం. శానిటేషన్‌ వర్కర్లకు వైద్య పరీక్షలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణ జరిపి గిరిజనులకు న్యాయం చేయాలి: జీవీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయక్ పంబలేరు వంతెన రహదారి పనుల పరిశీలన పశుపోషణతో రైతులకు లాభదాయకం అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9:33 గంటలకు పొట్టేపాలెం కలుజు ప్రారంభోత్సవం మైన్లలో అధికారుల తనిఖీలు వివరాలు గోప్యం అరసవల్లి అభివృద్ధికి నిధుల విడుదలపై ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం.. జై భీమ్ నగర్ గిరిజన కాలనీలో వైద్య విబిరం

గాలివాన బీభత్సం.. నేలకొరిగిన అరటి తోటలు రెండో, మూడో కోత దశలో పంటకు తీవ్ర నష్టం.. రైతుల్లో ఆందోళన

Select Suryaa Now
గాలివాన బీభత్సం.. నేలకొరిగిన అరటి తోటలు  రెండో, మూడో కోత దశలో పంటకు తీవ్ర నష్టం.. రైతుల్లో ఆందోళన

అనంతపురం బ్యూరో: నార్పల మండలం గడ్డంనాగేపల్లి గ్రామంలో బుధవారం వీచిన బలమైన గాలులకు అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్వల్ప వర్షం అనంతరం ఒక్కసారిగా ఈదురుగాలులు బలంగా వీయడంతో పలు అరటి చెట్లు నేలకొరిగాయి.

రెండో, మూడో కోత దశలో ఉన్న అరటి పంట దెబ్బతినడంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. నెలల తరబడి పంట సాగు కోసం చేసిన పెట్టుబడులు, శ్రమ గాలివాన కారణంగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంట చేతికందే సమయంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. అధికారులు వెంటనే గడ్డంనాగేపల్లి గ్రామంలోని దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి, పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా తగిన పరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గాలివానకు పంట నష్టపోయిన రైతుల్లో ఆర్. నవీన్, కే. వెంకటేష్, ఎం. వెంకటనాయుడు, జీ. వెంకటయ్య తదితరులు ఉన్నారు.