BREAKING
21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం డిసిసి అధ్యక్షురాలికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బికెఆర్ సత్కారం గోదావరిలో మృతి చెందిన చేపలను పరిశీలించినవిప్ నాయకర్ కోర్‌వీవ్ సిఈఓ సంచలన నిర్ణయం వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కావలి రామ సీత నామినేషన్ ఇండోనేషియా స్టాక్ మార్కెట్‌కు గ్లోబల్ షాక్ అమలాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి సమన్వయ సమావేశం: ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే ఆనందరావుల నేతృత్వంలో సీట్ల ఒప్పందం మోక్షపురి కంచిలో మంగళరూపిణి - కామాక్షమ్మ (అష్టాదశ శక్తిపీఠాలలో 2వది) వైఎస్సార్‌సీపీలో చేరిన జెట్టి అరుణ్ రేపల్లెలో 13 వార్డులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన శ్రీ సరస్వతి మాత అలంకరణలో దర్శనమిస్తున్న వన మైసమ్మ తల్లి. జెమినీ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌కు ఎదురుదెబ్బ భూగర్భ జలాల పెంపునకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు దోహదం:డీపీఓ జయసుధ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి --ఎమ్మెల్యే డాక్టర్ కామినేని పిలుపు

ఎన్నికలపై యువతకు అవగాహనా కార్యక్రమం

Select Suryaa Now
ఎన్నికలపై యువతకు అవగాహనా కార్యక్రమం

సింధియా, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో యువత పాత్రపై గాజువాక పోలీసులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు స్థానిక జింక్ క్రీడా మైదానంలో గురువారం గాజువాక శాంతి భద్రతల విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ వాసునాయుడు ఆదేశాలతో ఎస్ఐ కృష్ణబాబు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ కృష్ణబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత పాత్ర కీలకమని, ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొంటూ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో యువత పాత్ర, వారి విధులు బాధ్యతలు సహా ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అవగాహనా కల్పించారు.

 

రిపోర్టర్ : మనోజ్, మల్కాపురం, విశాఖపట్నం.