ఎన్నికల వేళ రేణిగుంటలో కూటమి జెండాలతో యువకుడి సైకిల్ తో చక్కర్లు! ప్రశ్నించగా తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నానని సమాధానం
రేణిగుంట మేజర్ న్యూస్: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రేణిగుంటలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద టీడీపీ, జనసేన పార్టీల జెండాలతో ఓ యువకుడు సైకిల్‌పై తిరుగుతూ కనిపించాడు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల జెండాలతో తిరగడంపై కొందరు అతడిని ప్రశ్నించారు. అందుకు స్పందించిన యువకుడు తాను తిరుమలకు సైకిల్ దయాత్రగా వెళ్తున్నానని చెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.