ఎన్నికల వేళ పోలీసుల నిఘా ముమ్మరం
ఎన్నికల వేళ పోలీసుల నిఘా ముమ్మరం
గుంతకల్లు సబ్‌డివిజన్‌లో విస్తృత తనిఖీలు.. 41 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జగదీష్ ఆదేశాల మేరకు గుంతకల్లు సబ్‌డివిజన్ పరిధిలోని ఐదు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
గుంతకల్లు పోలీస్ ఉప సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలోని 350 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 41 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేకంగా నిఘా ఉంచారు.