BREAKING
మద్ది ఆలయానికి రూ.2.56 లక్షల ఆదాయం నామినేషన్ల పరిశీలన అనంతరం.. పొదలకూరు మండల పరిషత్ బరిలో 87 మంది అభ్యర్థులు.. ఎస్సి అభివృద్ధి శాఖ కమీషనర్ ను కలిసిన పియు వీసీ శ్రీనగర్ వేదికగా మూడో విడత కాశ్మీర్ మారథాన్ భట్టిప్రోలు మండల ప్రజా పరిషత్ నామినేషన్ లు 61 చెల్లుబాటు అయ్యాయి వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం: గడువు కంటే 5 నెలల ముందే 11 కోట్ల 'రైతు ఐడీల' లక్ష్యం పూర్తి.. కేంద్ర వ్యవసాయ శాఖ చారిత్రక మైలురాయి! 20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సాయినాను గెలిపించండి. మాజీ కార్పొరేటర్ ఎస్కే బాబు డీ-లిమిటేషన్ 35 వార్డుల నుండి 48 వార్డులుతాడేపల్లిగూడెం పురపాలక సంఘం లో 1,00,728 మంది ఓటర్లు 54వార్డు లో వైసీపీ విశృత ప్రచారం డిజిపి ని తోలుబొమ్మ తో పోల్చిన జగన్ ని అరెస్ట్ చేయాలి - కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ వేల్పురి ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్, ఉగ్రవాదంపై పోరుకు స్పష్టమైన పునరుద్ఘాటన తమిళనాడులో భారీ వర్షాల హెచ్చరిక.. సహాయక చర్యల్లో ప్రభుత్వం మరింత చొరవ చూపాలి: కోయంబత్తూరులో టీఎంసీ అధ్యక్షుడు జి.కె. వాసన్ డిమాండ్! రూ.400 కోట్ల అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు.. బహిరంగ చర్చకు సిద్ధం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ వర్ధన్ రెడ్డి ఢిల్లీలో వాయు కాలుష్య మూలాల గుర్తింపునకు అత్యాధునిక ల్యాబ్ ప్రారంభం వెండి రథంపై ఊరేగనన్న వాసవి మాత

ఎన్నికల బరిలో తల్లీ కూతుర్లు * కూటమి తరపున పోటీ *

Select Suryaa Now
ఎన్నికల బరిలో తల్లీ కూతుర్లు   * కూటమి తరపున పోటీ *

ఆమదాలవలస, సూర్య : ఆమదాలవలస మండలంలో కూటమి తరపున ఎన్నికల బరిలో తల్లి, కూతుర్లు పోటీ చేస్తున్నారు. ఆమదాలవలస మండల జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా తమ్మినేని సుజాత, కలివరం ఎంపీటీసీ అభ్యర్థిగా టిడిపి నుండి తమ్మినేని భారతమ్మ పోటీలో నిలుస్తున్నారు. తమ్మినేని భారతమ్మ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు స్వయానా వదిన. భారతమ్మ కుమార్తె సుజాత ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీలో నిలుస్తున్నారు. వీరిద్దరూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారు కావడం విశేషం. తమ్మినేని భారతమ్మ ఎంపీపీగా ఎప్పటికీ ప్రజలకు సేవలు అందించారు. కూటమి తరపున స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ బలపరిచిన అభ్యర్థి కావడంతో కలివరం ఎంపీటీసీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారతమ్మ కుమార్తె తమ్మినేని సుజాత టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. గతంలో ఈమె టిడిపి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పార్టీకి ఎనలేని సేవలు అందించారు. ఈమె కృషికి టిడిపి అధిష్టానం గుర్తించి, ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రతిపాదించడంతో జడ్పీటీసీగా ఆమదాలవలస మండలం ఎన్నికల బరిలో నిలిచారు. దివంగత తమ్మినేని శ్యామల రావు కుమార్తె కావడంతో ఈమె విజయంపై గ్రామాల్లో సందడి నెలకొంది.

రిపోర్టర్ : రాము, సరుబుజ్జి, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా.