ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
నగరం, మేజర్ న్యూస్:ఈ నెల 21వ తేదీ నుంచి స్థానిక మండల పరిషత్ కార్యాలయములో ఎంపీటీసీ ఎన్నికలకు సంభందించిన నామినేషన్లు తీసుకుంటున్నట్లు ఎన్నికల అధికారి కె. సత్యన్నారాయణ సోమవారం
తెలిపారు. రేపటి నుంచి నామినేషన్లు పత్రములు ఎంపీడీవో కార్యాలయము నుండి పొందవచ్చన్నారు. మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఎస్సీ జనరల్ అల్లపర్రు, బోరమాదిగపల్లి, ఎస్సీ మహిళకు కొలగానివారిపాలెం కేటాయించారు. బీసీ జనరల్ కు చినమట్లపూడి, పెదమట్లపూడి, బీసీ మహిళకు పూడివాడ, ఏలేటిపాలెం కేటాయించారు. అన్ రిజర్వుడు మహిళలకు అద్దంకివారిపాలెం, నగరం, పెద్దవరం, ఈదుపల్లికి కేటాయించారు. ఈ మేరకు కార్యాలయం నోటీసు బోర్డులో ఆయన ప్రకటించారు. ఈయనతోపాటు ఎంపీడీవో బి. శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీవో అబిద్ హుస్సేన్ ఉన్నారు.