BREAKING
అనుమతులు ఘనం.. బిల్లులు శూన్యం బీవీసీలో భట్లపాలెం నందు యువజన ఉత్సవాలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకన్న ఆలయం మోడరన్ హైస్కూల్ లో ఆకట్టుకున్న రోబోటిక్స్ శిక్షణా కార్యక్రమం నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు. నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సహాయం కళ్యాణదుర్గం టి - సర్కిల్ అభివృద్ధి పనులకు శ్రీ కారం. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెక్కొండలో ఉపేందర్ హాస్పిటల్ పై అధికారుల దాడి అర్హులైన పట్టభద్రులు ఫారం- 18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి హనుమకొండ ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం కళ్యాణదుర్గం కొల్లాపూరమ్మ ఆలయం లో చోరీ.

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కరువు మండలాలు ప్రకటించాలి

Select Suryaa Now
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కరువు మండలాలు ప్రకటించాలి

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో  కరువు మండలాలు ప్రకటించాలి: సీపీఐ

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, కూటమి ప్రభుత్వం ఈ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోవడం దారుణమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి.రంగన్న అన్నారు.
శుక్రవారం ఎమ్మిగనూరులోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సక్రమంగా వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు పెట్టుబడులు నష్టపోయారని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం అప్పులు చేసి సాగు చేసిన రైతులు పంటలు దెబ్బతినడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని పేర్కొన్నారు.
జిల్లాలో కొన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం, తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని రంగన్న ప్రశ్నించారు. కరువు పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, పంట నష్టాలను శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం నియోజకవర్గంలోని మూడు మండలాల్లో కరువు పరిస్థితులను పునఃపరిశీలించి, వాటిని కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల సమస్యలపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.