ఎమ్మెల్యే సొంగ చేతుల మీదుగా అంగన్‌వాడీలకు నియామక ఉత్తర్వులు
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని జంగారెడ్డిగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ నియామక ఉత్తర్వులు అందించారు. జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన 11 మంది సహాయకులు, కామవరపుకోట మండలానికి చెందిన ఒక కార్యకర్త, ఏడుగురు సహాయకులకు ఈ ఉత్తర్వులు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ సిబ్బంది చిన్నారులను కన్నతల్లిలా భావించి విధులు నిర్వహించాలని సూచించారు. గ్రామస్థాయి లబ్ధిదారులతో ఆరోగ్యకరమైన వాతావరణంలో పనిచేస్తూ, పిల్లల ఆరోగ్యం, పోషణ, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఐసీడీఎస్ సీడీపీవో పి. బ్యూలా, సూపర్‌వైజర్లు ఎం. లక్ష్మీరాజ్యం, ఎం. విజయలక్ష్మి, కే. పద్మజ్యోతి, ఎన్. వీరకుమారి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కె.వి.రమణారావు జంగారెడ్డిగూడెం