BREAKING
మున్సిపాలిటీ పై వై సి పి జెండా ఎగరేయడమే లక్ష్యం. మాజీ ఎంపీ తలారి రంగయ్య. గోపాలపురంలో గురుకుల విద్యార్థులకు మహిళా భద్రతపై అవగాహన, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచన చెన్నైలో తుదిశ్వాస విడిచిన విలక్షణ సినీ సృష్టికర్త ముంగండ - ఇసుకపూడి రహదారి పనులు వేగవంతం హైస్కూల్ గ్రౌండ్‌లో రొయ్యల లోడింగ్: దుర్వాసనతో విద్యార్థుల అవస్థలు స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర అవార్డు అందుకున్న మాచవరం పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణకు ఘన సన్మానం విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు కొత్త భవనాలు సిద్ధం 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి... మాజీ ఎంపీ చింతా అనురాధ... పే స్కేల్ అమలు, నామినీ విఆర్ఎ ల రెగ్యులరైజ్, ప్రమోషన్ల కల్పన కోసం విఆర్ఎ ల ఆర్తనాదం రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు రోజువారీ జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునే సులభమైన మార్గాలు.. మానసిక ప్రశాంతత కోసం ఇవి పాటించండి అధికంగా చక్కెర తింటున్నారా.. శరీరంలో ప్రాణాంతక మార్పులు ఖాయం! జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా టాలీవుడ్‌లో కొరియన్ డ్రామాల జోరు.. భారత్‌‌లో విపరీతంగా పెరిగిన మహిళా ప్రేక్షకుల సంఖ్య మనసున్న... మా రాజు వాసంశెట్టి సత్యం... కంచుమర్తి బాబురావు

ఎమ్మెల్యే సమక్షంలో టిడిపి లో చేరిక చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై చేరినట్లు వెల్లడి.

Select Suryaa Now
ఎమ్మెల్యే సమక్షంలో టిడిపి లో చేరిక  చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై చేరినట్లు వెల్లడి.

కొత్తూరు అక్టోబర్ 02 : సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరిగాయి. మండలంలోని మెట్టూరు బిట్ వన్ గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు అక్టోబర్ 2న పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామ మాజీ సర్పంచ్ అదపాక శంకరరావు, బర్రి గోవిందరావు ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.

రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు కొత్తగా చేరిన వారు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు, ప్రివిలేజ్ కమిటీ సభ్యుడైన మామిడి గోవిందరావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్టీలో చేరిన వారు ఇకపై పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలందరూ సమష్టిగా పనిచేసి గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. కొత్తూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ఆదరణకు ఈ చేరికలు నిదర్శనమని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.