BREAKING
అతి సున్నిత పోలింగ్ కేంద్రాల పరిశీలన... జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అశ్వారావుపేటలో 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు డా కరుణాకర్ కి ఘనసత్కారము పార్టీ ఎన్నుకున్న అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్త చాటాలి గొంగటి రఘునాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాల్యానికి బాసటగా.. అంగన్‌వాడీ ఉత్సవం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బిర్లను ఇండస్ట్రీస్‌కు... ప్రత్యేక 33 కేవీ ఫీడర్ పనులకు శ్రీకారం... ప్రధానమంత్రి పుట్టిన రోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పెండింగ్‌ నోటీసులు, విచారణలను వేగవంతంగా పూర్తి చేయాలి చెరువులో చేప పిల్లలను వదిలిన వైద్య సిబ్బంది!

ఈవీ బస్ ఛార్జింగ్ స్టేషన్ పనుల పరిశీలన..

Select Suryaa Now
ఈవీ బస్ ఛార్జింగ్ స్టేషన్ పనుల పరిశీలన..

ఎస్ ఆర్ టి సికి ప్రత్యేక 33 కేవీ విద్యుత్ సరఫరా ఏర్పాట్లు    పనుల పురోగతిపై...   డైరెక్టర్ గురవయ్య సమీక్ష 

నెల్లూరు, వేదాయపాలెం, మేజర్ న్యూస్  :  నెల్లూరు జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈవీ బస్ ఛార్జింగ్ స్టేషన్  కు సంబంధించిన సివిల్..ఇతర అనుబంధ పనులను ఏపీఎస్పీడీసీల్ డైరెక్టర్ కె. గురవయ్య పరిశీలించి, పనుల పురోగతిని సమీక్షించారు.  ఈ సందర్భంగా అంబాపురం–కొత్తూరు 220 కేవీ సబ్‌స్టేషన్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ కి ఈవీ బస్ ఛార్జింగ్ స్టేషన్ కోసం ప్రత్యేకంగా 33 కేవీ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసే పనులపై అధికారులతో చర్చించారు. ఛార్జింగ్ స్టేషన్‌కు అవసరమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టంగా, నాణ్యమైన ప్రమాణాలతో మరియు నిరంతర విద్యుత్ సరఫరాకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.  ఈవీ బస్సుల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, వాటికి అవసరమైన ఛార్జింగ్ మౌలిక వసతులను ముందుగానే అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణహిత ప్రజా రవాణాకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. ఛార్జింగ్ స్టేషన్‌కు సంబంధించిన సివిల్ పనులు, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు, 33 కేవీ ప్రత్యేక లైన్ తదితర పనులను సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  అలాగే పనుల సమయంలో భద్రతా ప్రమాణాలు, నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, భవిష్యత్తులో ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అందే విధంగా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో నెల్లూరు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. సుధాకర్, టెక్నికల్ విద్యుత్ ఆపరేషన్ డివిజన్ విభాగాలకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు.. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు.. ఇంజనీర్లు.. సిబ్బంది తోపాటు ఆర్టీసీ  అధికారులు పాల్గొన్నారు.