దుర్గమ్మ ఆలయానికి రూ 4.5 లక్షలు విరాళం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం;తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం డ్రైవర్స్ కాలనీలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు భారీ విరాళం అందజేశారు. ఆలయానికి రంగులు వేయించేందుకు రూ.3 లక్షలు, దసరా నవరాత్రి మహోత్సవాల నిర్వహణకు మరో రూ.1.50 లక్షలు కలిపి, మొత్తం రూ.4.50 లక్షల భారీ విరాళం అందించారు. గోకవరం డ్రైవర్స్ కాలనీలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన కంబాల శ్రీనివాసరావు కు కాలనీ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి, ఘనంగా సత్కరించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు._దసరా నవరాత్రి మహోత్సవాల నేపథ్యంలో శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి రంగులు వేయించి మరింత అందంగా తీర్చిదిద్దేందుకు సుమారు రూ.5 లక్షల వ్యయం అవుతుందని, ఇందుకు సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలు కంబాల శ్రీనివాసరావును గతంలో కోరారు. దీనిపై స్పందించిన కంబాల శ్రీనివాసరావు ఆలయానికి రంగులు కోసం రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా తొలుత రూ.2 లక్షలు గతంలో అందజేశారు. తాజాగా మరో రూ.3 లక్షల నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందించారు.అంతేకాకుండా దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మరో రూ.1.50 లక్షల చెక్కును కమిటీ సభ్యులకు అలయం వద్ద అందజేశారు. ఆలయ అభివృద్ధితో పాటు దసరా మహోత్సవాల నిర్వహణకు విరాళం అందించడం పట్ల కాలనీ ప్రజలు, కమిటీ సభ్యులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు._