BREAKING
నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు బంగారు బందరుగా మచిలీపట్నం తీర్చిదిద్దుతాం

దివ్యాంగుల స్వావలంబనకు కూటమి అండ

Select Suryaa Now
దివ్యాంగుల స్వావలంబనకు కూటమి అండ

 

అనంతపురం బ్యూరో,.పదిమంది దివ్యాంగులకు స్కూటీల పంపిణీ: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్అనంతపురం: దివ్యాంగులు ఆత్మగౌరవంతో స్వావలంబనగా జీవించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అనంతపురం నియోజకవర్గానికి చెందిన పదిమంది దివ్యాంగులకు స్కూటీలను ఆయన పంపిణీ చేశారు.

మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, విభిన్న ప్రతిభావంతుల చైర్మన్ నారాయణస్వామితో కలిసి లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్కూటీలతో దివ్యాంగులు రాకపోకలకు ఇతరులపై ఆధారపడకుండా విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

స్కూటీలు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.