ఢిల్లీలో లాఠీ చార్జి ఖండించండి:
- ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ను తక్షణమే పదవి నుంచి తొలగించండి:
- వామపక్షాలు డిమాండ్
బొబ్బిలి, సూర్య: వామపక్షాలు కాంగ్రెస్ రైతు సంఘాలు ఆదివారం ఎన్టీఆర్ బొమ్మ సెంటర్లో నిన్న ఢిల్లీలో జరిగిన ఆందోళనలో మోడీ ప్రభుత్వం వామపక్షాలు, కాంగ్రెస్ యువకుల పైన లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ, రైతు సంక్షేమ సంఘం నాయకులు పి. శంకరరావు, మువ్వల శ్రీనివాసరావు, ఒమ్మి రమణ, మెరుగాని గోపాలు, వేమిరెడ్డి లక్ష్మి నాయుడు మాట్లాడుతూ ఎన్నికల ప్రధాన కమిషనర్ చేసిన అక్రమాలు, తప్పుడు నిర్ణయాలును ఎన్నికల సంఘం స్వాతంత్రతను, విశ్వనీయతను దెబ్బతీసిన ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని దేశమంతా ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పాల్సిన బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే వాళ్ల పై లాఠీచార్జి అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడం భయపెట్టించడం ప్రజాస్వామ్యానికి పౌర హక్కులకు మోడీ ప్రభుత్వం తీవ్రంగా నష్టం చేస్తుందని అన్నారు. ఎస్ ఐ ఆర్ పేరుతో 13 కోట్లకు పైగా ఓట్ల తొలగింపు ఎన్నికల కమిషనర్ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే జ్ఞానేశ్ కుమార్ చరిత్ర అంతా అవినీతి మయమని తెలుస్తుంది అటువంటి వ్యక్తిని ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బీజేపీ ప్రభుత్వం నియమించింది. అంటే ఎన్నికలను ఫాల్స్ గా మార్చి నియంత పరిపాలన చేయాలని చూస్తున్నది. అటువంటి బిజెపికి మన రాష్ట్రంలో పాలక పార్టీలన్నీ కొమ్ము కాయడం వెనుక వీళ్ళ అవినీతి వీళ్ళు చేసిన తప్పుడు పనులు దాని నుంచి రక్షించుకోవడానికి మోడీ ప్రభుత్వానికి సమర్థిస్తున్నారని అన్నారు. దేశ భవిష్యత్తు కోసం రాజ్యాంగ రక్షణ కోసం ప్రజలు యువకులు స్వచ్ఛంద సంస్థలు ప్రజాతంత్ర వాదులు దేశభక్తులు జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేంతవరకు బిజెపి ప్రభుత్వం అకృత్యాలు కు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి గోపాలు ఈ శేషగిరి మునకాల శ్రీను, మండపాక శ్రీను, జి వాసు కార్యకర్తలు పాల్గొన్నారు.