దేవీ మండపాన్ని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం నుంచి మొదలవడంతో నిమ్మాడ గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు సమర్పించారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండటంతో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.