దేవరగట్టు ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోండి
దేవరగట్టు ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోండి
హొళగుంద, సూర్య,(ఆలూరు)
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండల పరిధిలోని ఈనెల 21వ తేదీన విజయదశమి రోజున దేవరగట్టులో జరిగే బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని భక్తులకు జిల్లా కలెక్టర్ ఏ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజలకు తెలియజేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు నెమలికి,నెరణితాండ, కొత్తపేట గ్రామస్తులకు సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, హోళగుంద, హాలహర్వి, ఆలూరు మండలాల అధికారులు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల పోస్టర్లను విడుదల చేశారు.