డస్ట్ బిన్ గురించి ఇంటింటా అవగాహన
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి కమీషనర్ ఆదేశాల మేరకు బుధవారం ఆత్మకూరు మండలంలోని కరటంపాడు గ్రామంలో డోర్ టు డోర్ బిన్ బాగ్ సిస్టం గురించి వివరించడం జరిగింది. ఆత్మకూరు ఎం పి డి వో పి. రఫీఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.పారిశుద్ధ కార్యక్రమాల్లో భాగంగా బిన్ అనగా డస్ట్ బిన్ అని సదరు డస్ట్ బిన్ లో ప్రతి గృహస్తులు తడి చెత్తని గ్రీన్ అంబాసిడర్ కి ఇవ్వాలని సూచించారు. అలాగే బ్యాగ్ అనగా ప్లాస్టిక్ బ్యాగ్ గాని గన్ని బ్యాగ్ గాని వీటిల్లో పొడి వస్తువులైన ప్లాస్టిక్ బాటిల్స్ కవర్లు కాటన్ బాక్సులు వంటివి దాదాపు 29 అంశాలు వేసి పెట్టుకుని స్వచ్ఛ రథం గ్రామాన్ని సందర్శించినప్పుడు సదరు బ్యాగులోని వివిధ రకాల వస్తువులు స్వచ్ఛరథం ఆపరేటర్కు ఇచ్చి సదరు వస్తువుల ధరకు అనుగుణంగా పలసరుకులు గాని ఫ్యాన్సీ వస్తువులు గాని పొందవచ్చు అని ప్రతి ఇంటి వారికి తెలియజేయడం జరిగింది. ఈ ప్రక్రియ వల్ల గ్రామం పరిశుద్ధంగా ఉంటుందని తద్వారా గ్రామస్తులు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందని ఎంపీడీవో రఫీఖాన్ వివరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపిడివోలు భువనేశ్వరి, మాల్యాద్రి, పంచాయతి కార్యదర్శి షఫీ తదితరులు పాల్గొన్నారు.