దసరా నవరాత్రులు ప్రారంభం సందర్భంగా కన్యకా పరమేశ్వమి అమ్మవారిని దర్శించుకున్న తాతయ్య
దసరా నవరాత్రుల ప్రారంభం సందర్భంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-దసరా శరన్నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి రోజు జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, జగ్గయ్యపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు.
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ధూళిపాళ్ల లక్ష్మణరావు, పెనుగొండ సతీష్, పెనుగొండ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
శివా జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా