చోరీకి గురైన బస్సు ఆచూకీ లభ్యం -జీపీఆర్ఎస్ తో దొరికిపోయిన దొంగ -చాగలమర్రిలో పోలీసులు బస్ స్వాధీనం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : తిరుపతి సెంట్రల్ బస్టాండ్ లో అపహరణకు గురైన బస్సు ఆచూకీ ఇటికేలకు లభించింది. 20వ తేదీ సాయంత్రం తిరుపతికి చేరుకున్న బస్సును బస్టాండ్ ఆవరణలో పార్క్ చేసి డ్రైవర్, కండక్టర్ రెస్ట్ రూమ్ లో సేదదీరారు. ఉదయం 3.30 గంటల ప్రాంతంలో బయలుదేరేందుకు బస్ పార్క్ చేసిన ప్రాంతానికి చేరుకున్న డ్రైవర్ కు బస్ కనపడలేదు వెంటనే యజమాని, ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు.ఆర్టీసీ అధికారుల సూచనలతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
జీపీఆర్ఎస్ తో చిక్కిన దొంగ
బస్ యజమాని వెంకటేశ్వరరావు తన బస్సులో ఉన్న జీపీఆర్ఎస్ ద్వారా బస్ నంద్యాల వైపు వెళ్తున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.వెంటనే అప్రమత్తమైన చాగలమర్రి పోలీసులు నంద్యాల జిల్లాలో బస్సును వెంబడించి పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన నిందితుడు విష్ణుతో పాటు బస్సును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని, ఆర్టీసీ హైర్ బస్సును తిరుపతికి తీసుకురానున్నట్లు పోలీసులు తెలిపారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్