BREAKING
డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్మందుల సంధ్య కుటుంబానికి పరామర్శ రణ్‌వీర్ సింగ్ ధురంధర్ సినిమా స్పై జోనర్ ప్రమాణాలను మార్చేసింది: నటి నిమ్రత్ కౌర్ ప్రశంసలు రాష్ట్ర అధ్యక్షుడికి సాదర ఎంఎల్‌ఏ స్వాగతం నేడు పలు కార్యక్రమాలలో పాల్గొననున్న గొట్టిపాటి లక్ష్మి మొదటి నెల జీతంతో వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ సర్వే పనుల పురోగతిని వేగవంతం చేయాలి* విద్యతో పాటు సేవలోనూ ఆదర్శం. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు సంధ్యారాణికి ఘన సన్మానం. శానిటేషన్‌ వర్కర్లకు వైద్య పరీక్షలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణ జరిపి గిరిజనులకు న్యాయం చేయాలి: జీవీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయక్ పంబలేరు వంతెన రహదారి పనుల పరిశీలన పశుపోషణతో రైతులకు లాభదాయకం అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9:33 గంటలకు పొట్టేపాలెం కలుజు ప్రారంభోత్సవం మైన్లలో అధికారుల తనిఖీలు వివరాలు గోప్యం అరసవల్లి అభివృద్ధికి నిధుల విడుదలపై ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం.. జై భీమ్ నగర్ గిరిజన కాలనీలో వైద్య విబిరం

చిన్నారులు, గర్భిణీల ఆరోగ్యమే మోదీ లక్ష్యం -ప్రధానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ కృతజ్ఞతలు

Select Suryaa Now
చిన్నారులు, గర్భిణీల ఆరోగ్యమే మోదీ లక్ష్యం -ప్రధానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ కృతజ్ఞతలు

 

చిన్నారులు, గర్భనిలు, బాలింతలు, సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా మోదీ అనేక సంక్షేమ అమలు అభినందనీయమని, ఈ కృషికి ప్రధాని మోదీకి బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న "సేవా సంకల్ప అభియాన్"లో భాగంగా తిరుపతిలో అంగన్‌వాడీ ఉత్సవ్ - పోషణ్ అభియాన్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి ఆలకుంట అనిత అధ్యక్షతన చింతకాయల వీధి, గాలి వీధి, మంచాల వీధి, పట్నాల వీధి, గిరిపురం-1, గిరిపురం-2, సిపిఎన్ కాలనీ, పూసల వీధి అంగన్‌వాడీ కేంద్రాల్లో జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న పోషకాహారం, ఆరోగ్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అనూష రామకృష్ణ ఆధ్వర్యంలో గర్భిణీలకు పౌష్టికాహారంతో పాటు చీర, జాకెట్, పసుపు కుంకుమలు అందించి ఐదుగురు ముత్తైదువుల చేత దీవెనలు ఇప్పించారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా మీడియా కన్వీనర్ హరి, సెంట్రల్ మండల అధ్యక్షుడు దీపక్ యాదవ్, వెస్ట్ మండల అధ్యక్షుడు శ్రీధర్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సవిత, డా.ప్రియదర్శిని, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.